Wednesday, October 19, 2011

ప్రేమ శాశ్వతం....

నింగి నుండి దూకే ఆ చినుకు
వరదై నిలువెల్ల ముంచి,
తన రూపునే మార్చేసిందని
పారే ఆ సెలయేరు చినుకుతో గొడవపడి
కోపంతో స్నేహాన్ని విడిచిందా........?
మల్లి తన కొంగుచాచి పట్టి
తనలో కలుపుకొని
తిరిగి ఆవిరిగా మారి
ఆ చినుకుకి మరు జన్మనివ్వలేదా...?

చల్లని చిరుగాలి

ఆవేశంతో చెలరెగి సుడిగాలిలా మారి
తనరెక్కలు విరిచి తన గమ్యాన్ని మార్చిందని
పక్షి ఏనాడైనా ఆ గాలిపై
అలకబూని,మాట్లాడటం మానేసి...
స్నేహం చేయకుండా వుందా...?
మరల ఆ గాలిని రెక్కలతో
తన గుండెలకి హత్తుకొని
హాయిగా అకాశంలో విహరించటం లేదా...?

కల్మషం ఎరుగని ఆ స్నేహంలో

వేలాది తీపిగురుతులే కనిపిస్తాయికాని
అప్పుడప్పుడో....అనుకొకుండానో జరిగే పొరపాట్లో, తప్పులో కావు
పొరపాట్లు సహజం...
కోపం క్షణకాలం...
ప్రేమ శాశ్వతం....


.......బాబు

ఒంటరితనం

స్వయప్రకాశవంతమైన చుక్కలేన్నోవున్నా
చల్లని వెన్నెల పంచే ఆ జబిలమ్మ కనబడకపోతే
ఆ నింగి చిన్నబోదా...
నవ్వుతూ చుట్టువున్న నలుగురు పలకరించినా
నా అనుకునే వాల్లు దూరమవుతే...
అందరువున్నా ఒంటరితనంలా అనిపించదా...

....బాబు

Thursday, October 13, 2011

మన్నించు నేస్తమా...

ఆవేశంలో...ఆలోచనరహితంగా
జారిన మాటలు
నీ మనసును భాధపెట్టాయన్న ఆలోచనలు
మండే నిప్పుకణికలోలే...
నన్ను నిలువేల్ల దహించివేస్తుంటే...
చేసిన తప్పుకి తలవంచి
మనస్పుర్తిగా మన్నించమని తప్ప
మరెమి చేయలేని నిస్సాహయున్ని నేను...
కాని
గుండె మీద చేయివేసుకొని మాటిస్తున్నా నేస్తం
మరెన్నడు నీ మనసుని భాధ పెట్టనని....

.....బాబు

నా జాబిలి...

ఎప్పుడు అల్లరి చేస్తూ..

నవ్వుతూ....నవ్వుల వెన్నెల విరభూయించే


నా జాబిలి....

నేడేందుకో చిన్నబోయింది


ప్రతి చిన్నదానికి చిరాకు పడుతుంది....


ఆ నవ్వుల పరిమళాలను


మనసారా ఆస్వాదిస్తూ....ఆరాదిస్తూ


తనకోసమే తపన పడే ఓ మనసు


అది చూసి అల్లాడి పోతుందని


అర్థమయ్యేలా తెలిపేది ఎలా?


------బాబు

కనులు

కలువ పువ్వుల్లాంటి ఈ కనులు చూస్తుంటే
కనుపాప వెలుగునైనా కాకపోతినే అనిపిస్తూంటే...
కనీసం కాటుకల్లే అయినా మారాలనిపించే....
కనులకి మరింత అందం అద్దటానికి.....
                                                  ---బాబు

ఎర్ర గులాబి

నిండుగా విరభూసావు....
సిగ్గుతో ఎర్రబడ్డావు....
ప్రేమకి చెరగని చిహ్నమై నిలిచావు...
మాటైనా మాట్లాడకుండానే నువ్వు
నా చెలి మనసు దోచేసావు...
నేను నీలాగైనా పుట్తుంటే బాగుండుకదా
అని అని పించేలా చేసావు...
.....బాబు

Thursday, September 15, 2011

i love you.....

అందమైన నీ అల్లరో తెలియదు...
అప్పుడప్పుడు ప్రదర్శించే పసిపాపలాంటి నీ అమాయకత్వమో తెలియదు...
అలుపన్నది ఎరుగని నీ మాటల మాటునదాగిన
అమృతాన్ని మించిన ఆ ప్రేమభావమో తెలియదు...
అలసినప్పుడో, మనసు బాధలో ఉన్నప్పుడో..మౌనంగా నేనుంటే.....
మాటలతో నను చేరి
నా హృదయాన్ని హత్తుకొని
పెదాలపై చిరునవ్వై  చిగురించే
నీ స్నేహమో తెలియదు...
అన్నింటిని మించి
కష్టాలను,కన్నీళ్ళను చదివెదిగిన నీ ఆత్మస్థైర్యమో తెలియదు
అనుకున్నది సాధించాలనే నీ పట్టుదలో తెలియదు కాని
పరిచయమైన కొద్ది రోజుల్లోనే
నన్ను నీకు చేరువచేసాయి..
తెలియకుండానే......నా గుండె లయవై
గుప్పెడు గుండెలో కొలువైన.....
నీతో కలసి జీవితాన్ని పంచుకోవాలనే బలమైన ఆశ నాలో కలిగించాయి..
నాకు ఎంతో నచ్చిన నీకు......
రెండు చేతులు చాచి నన్ను నేను అందిస్తున్న ఒక బహుమతిగా
మనస్పుర్తిగా స్వీకరిస్తావనే కొండంత ఆశతో.....
i love you .............


                                               ...బాబు

Saturday, September 3, 2011

మౌనం

నీతో మాట్లాడకుండావున్న ఒక్కరోజే
కొన్ని యుగాలుగా తోస్తుంటే
కరిగిపోని ఈ కాలాన్ని తిట్టుకోనా....
మాట్లాడలేకుండా మౌనంగా ఉన్న నా మనసును నిందించుకోనా ...
ఏది ఏమైనా
మౌనంగానే తెలుపుతున్న నా మనోవేదన...
మౌనంగానే చేస్తున్నా నీకై నే ఆరాధన...
ఈ మౌనమైన అవుతుందేమో మన మనసులను కలిపే వంతెన...
....బాబు

కరుణించరేమి...?

చస్తూ బ్రతుకుతున్నా..
బ్రతుకుతూ చస్తూన్నా....
బరించలేని ఈ దూరంలో....
బరువెక్కిపోతున్న మనసుతో...
అదుపుచేసుకోలేని ఆలోచనలతో...
పడుకునేటప్పుడు ఆ వెన్నెల చంద్రున్ని...
లేవగానే ఆ తొలిపొద్దు సూర్యున్ని...
బ్రతిమిలాడుకుంటున్నా వేగంగా వెళ్ళిపొమ్మని..
కరిగిపోనివ్వండి ఈ కాలాన్ని అని....
అయినా కరుణించరేమి...?
ఈ కాలాన్ని కరిగిపోనివ్వరేమి....?
.....బాబు

కలలోనైనా...

కనుల ముందు నిత్యం సవ్వడి చేసి
కనురెప్పల కదలికల్లో కొలువైన నువ్వు....ఉన్నట్లుండి

కనుమరుగైపోయాకా....
కలలోనైనా కనిపిస్తావేమో అని...
కనులుముస్తే ఆ కారే కన్నీరు కునుకైనా రానివ్వదేమి....?
....బాబు