Tuesday, December 17, 2013

కన్నీటి కలువలు


కలవని తలచి
కథగా మలచి
కాలంతో పరిగెడుతుంటే....
ఎందుకే చెలి
ఎదలోతుల్లో 
ఏనాడో సమాది చేసిన నీఙాపకాలు
నిత్యం అలలై ఎగసి
తడి ఆరిన
కనుల కొలనులో
కన్నీటి కలువలు పూయిస్తాయి......
                              .....బాబు

Tuesday, August 27, 2013

అక్షరమా నీ ఋణమెట్లా తీర్చుకోను


అక్షరమా నీ ఋణమెట్లా తీర్చుకోను
మనసుపడిన మగువకు
మదిలోని మాటలు తెలుపదలచినపుడు
పదాలు పెదాలు దాటనివేళ
లోలన నే మదనపడుతుంటే
కాగితంపై అందంగా ఒదిగి
నేనున్నా అన్నావు..

కోపమైనా,ఆవేశమైనా
ఆరాటమైనా,ఆలోచనైన
అందంగా అల్లుకున్నావు
అందరికి చేరువయ్యావు
ఎవరిని నొప్పించకుండా
నా మనసు అద్దమై నిలిచిన నీ...
పాదాలకి వందనాలు...
....(బాబు 27-08-2013)

Saturday, August 24, 2013

ఆరాటం

ఊహల వాకిల్లలో
విహరించు వేళ
కలల తీరంలో
అలలై ఎగసిన
అస్పష్ట దృష్యాలని
కాన్వాసు పై బందించి
ఊహలని వాస్తవాలని
రంగరించి రంగులద్ది
ప్రాణం పోసి
మౌనంగా మాట్లాడటం నేర్పి
ప్రపంచానికి పరిచయంచేయాలని
పదే పదే పరితపిస్తుంటా..
అనుక్షణం ఆరాటపడుతుంటా...

ఊహల ఊబిలో
ఊపిరిబోసుకున్న ఊసులకి
మనసు గదిలో
ఆలోచనల సంఘర్షనలో
ఆవిర్బవించిన భావాలకి
ఆక్షరాలతో జీవంపోసి..
ఒక్కసారిగా రెక్కలోచ్చిన
పక్షిలాగా ఆ అక్షరాలని
అన్ని దిక్కులా 
ఆశగా ఎగరనివ్వాలని
అనుక్షణం ఆరాటపడుతుంటా...
పదే పదే పరితపిస్తుంటా..
         .....బాబు(12-08-13)

Sunday, August 18, 2013

//వరమా..?శాపమా?//



నువ్వేవరో..మరి
నేనేవరో ...
కాలం కలిపేను 
కారణమేమిటో ?

అంతా ఓ కలలా..
అంతుపట్టని మాయలా ..!
అంచలంచెలుగా ఎదిగేను
అందమైన బంధమేదో...

అంతలోనే ఎదో అలజడి
అక్కున చేర్చిన కాలమే
కారణాలు వెతికి వెతికి 
వేరు చేసె మనలా....

వరమనుకోవాలా
శాపమనుకోవాలా...
ఊహించని జీవితాన
ఉదయించి అస్తమించిన నీ పరిచయాన్ని..
                           ......బాబు(18-08-13)


Friday, August 16, 2013

Untitled

శూన్యం నిండిన
ఎద canvas పై
ఆప్యాయతనే కుంచెతో
మాటల రంగులు చల్లుతుంటే
ఆశల చిత్రమేదో
ప్రాణంపోసుకునె...
దాని పేరు ప్రేమని మురిసేలోపే..
ముక్కలు ముక్కలుగా విడదీసి
అర్థంకాని రంగులు అద్ది
అతలాకుతలం చేసి...
abstract గా మలచి
untitled అనే..
                   ......బాబు

Tuesday, August 13, 2013

కన్నీటిచుక్క

కంటి పాప నుండి అయిష్టంగానే
జారువడిన కన్నీటిచుక్క...
చెమంతి పువ్వంటి చెంపని
ముద్దాడి మురిసి
గర్వంతో గదవై చేరి
ముత్యమల్లె మెరిసి
నీకు మరింత అందాన్ని అందించేను కదా...
ఎంతటి అదృష్టవంతురాలు...

Monday, August 12, 2013

కల

   
ఎంత అధ్బుతమైనది ఈ కల...
దేవుడిచ్చిన అందమైన వరమేనేమోకదా?
అసాద్యమనుకున్న నిన్ను నన్ను
కొన్ని క్షణాలైనా ఒక్కటి చేసిన గొప్ప మాయే కదా!
ఎంతగా నిను ప్రేమించినా
ఏనాడు పట్టించుకోకపోగా
ఎప్పుడు కసురుకునే నీవు...కలలో మాత్రం..
గుండెల నిండిన ప్రేమని కళ్ళతోనే పలికిస్తూ
ఆత్మీయంగా నను నీ గుండెలకి హత్తుకుంటావు..
అందమైన నిన్ను మరింత అందంగా పొగుడుతుంటే
ఆనందంతో చిన్న పిల్లల మురిసిపోతూ
ముద్దుల్లోముంచేస్తుంటావు..
చిరునవ్వుల వెన్నెల కురిపిస్తూ
మల్లెల మాటలతోటలో ఆప్యాయంగా విహరింపజేస్తావు...
అంతలోనే ఎదో అలక చుట్టుముట్టగా...
కంటిపాపలకి నువు గొరింటాకు అద్దగా
తల్లడిల్లిపోయిన నా మనసు తట్టుకోలేక
ప్రేమగా నిను బ్రతిమిలాడుతుంటే
కన్నీటితో నా గుండేని తడిచేస్తావు..
నీ ప్రేమతో నా కళ్ళుచెమ్మగిల్లేలా చేస్తావు..
ఎంత అధ్బుతమైనది ఈ కల...
దేవుడిచ్చిన అందమైన వరమే కదా....
                                      ......బాబు


Thursday, July 25, 2013

నేల

    
తొలకరి జల్లులు జలకాలాడించంగా,
మట్టిపరిమళాలు అత్తరు అద్దంగా,
పొద్దుపొడుపు సూరిడూ సిందురమై మెరవంగా,
ఎర్ర రేగడి భూముల్లో పారేటి నీరు పారాణిదిద్దంగా,
పడుచుపిల్ల నడుమోంప్పుల్లో చెమట దారల్ల....
వాగులు వంక్కలు వయ్యారంగా ప్రవహించంగా..
ఆనందంతో రైతులు నారలుకుతూ
పచ్చని పట్టుచీర కడుతుంటే..
పరవశించిపోతూ... నేల చిరునవ్వులు చిందిస్తూ
పెళ్ళికూతురల్లే కనిపించే కనువిందు చేస్తూ ...
                                                     ....బాబు

Sunday, April 21, 2013

నేటి సమాజం

సంపాదన
స్వార్థమనే
పురుగులుపట్టి
కుళ్ళిపోతున్న
శవాలనడుమన
మానవత్వం మట్టినకలిసి
సమాజం మార్చురీలా

కంపుకొడుతున్నది....
                        ....బాబు(21-04-2013)

Monday, April 15, 2013

ఆధునిక యుగంలో అచ్చతెలుగమ్మాయి


ఎవరే చెలి నీవు
ఏ లోకంనుండి ఎగిరొచ్చావు...
ఆధునికతంటూ ఆగమైపోతున్న
నేటి ఈ లోకంలోకి...
ఆశ్చర్యాంగా ఉంది...
మరోవైపు అధ్బుతంగాను ఉంది..
ఆడేవరో మగెవరో అంతుపట్టరాని
అలంకరణల ఈ యుగంలో...
అచ్చతెలుగు అమ్మాయంటే...
కవుల భావాల్లోనో...
కళాకారుల ఆకృతుల్లోనో
జీవంలేని కలల్లోనో
ఊపిరిలేని ఊహల్లోనో...మాత్రమే
కనిపించే ఈ రోజుల్లో...
ఒక మెరుపులా మెరిసావు పరికిణిలో
పచ్చని పైరులా
మా పెరటిలోన  సీతకోక చిలుకలా
చిన్ననాటి మా గుడిసే గూడులోని గువ్వ పిట్టలా
వయ్యారంగా వంపులు తిరిగిన మా ఊరి వాగులా...
తొలకరి జల్లుకి పులకరించిన పుడమితల్లి మట్టివాసనలా...
తొలి పొద్దు కిరణాల స్పర్శకి
విచ్చుకున్న పొద్దుతిరుగుడుపువ్వులా
ముద్దు ముద్దుగా..
పాతకాలపు పల్లె అందాలన్ని
నిలువెల్ల సింగారించుకొని...
అడవిమల్లేలాంటి అందంతో
పారిజాత పరిమళాలు వెదజల్లుతూ..
హంసలాగా వయ్యారంగా నడుస్తూవుంటే
పట్టపగలు పండు వెన్నెల విరబూసే
నిండుగా నా రెండు కనుల కొలనులో
పదే పదే అదేపనిగా నిను చూడాలనిపించేలా...
అందం..అమయకత్వం...నిండిన ఆ కళ్ళతో
మంత్రమేదొవేసి..నను దాటి వెళ్తుంటే..
నను నేను గిల్లి చూసుకున్న
నమ్మశక్యంకాని
ఈ నిజం ఋజువు చేసుకోవటానికన్నట్లు...

                               .....బాబు(15-04-2013)


Wednesday, April 10, 2013

ఏది ఉగాది?


ఉగాది వస్తుందికదా అని
ఉల్లాసంగా ఏదో నాలుగు అక్షరాలు
అందంగారాయాలని ఆనందంగా నాలో నేనే
ఓ కవిలా ఫీలవుతుంటే...
అక్షరాలు నన్ను చూసి నవ్వాయి
నువ్వు కవివేంటిరా అన్నట్లూ...
అయినా పరవాలేదని
పదాల అర్థాలు తెలియకపోయినా
ప్రాసలో మాత్రం మంచి పస ఉండాలని
పది దినాల నుండి పనిమానుకొనిమరీ
నా అలోచనల్ని పరి పరి విదాల పలు దిక్కులు పరిగెత్తిస్తుంటే
ప్రకృతి గుర్తొచ్చి ఫటా ఫట్ ఓ పది వాక్యాలు రాసి
కవిననిపించుకోవాలని కలం పట్టి కవిత పని పట్టాలని
కాగితం ముందు కుర్చున్నా కాని
మళ్ళి ఏదో తడబాటు
ప్రకృతి అందాలని ప్రత్యక్షంగా చూస్తే తప్ప
కలం కదిలేలా లేదనని నేనే కదిలా
ఎప్పుడో నా చిన్నపుడు పెరిగిన మా పల్లేటూరికి
పాత జ్ఞాపకాలని నేమరేసుకుంటూ
పల్లేవాకిల్లల్లో నడుస్తూ
నా చిన్నతనంలోలాగా
వరసలు కలిపి ఆప్యాయంగా పలకరించే
మనుషులు ఎదురోస్తారని
పచ్చని పైరు పంటలు
గల గలా పారేటి సేలయేళ్లు
పూతవేసిన మామిడితోటలు
లేత చిగురు తింటు పరవశంతో పాడేటి కోయిలలు
ఝుమ్మని పలికే తుమ్మెదలు దర్శనమిస్తాయేమోనని
ఎంతో ఆశతో వెళ్తే.... ఎక్కడకూడా
చైత్ర మాసపు చాయల్లేవు
వసంతకాలపు ఆనవాల్లు కాసింతైనా కానరాలే
ఎటు చూసిన ఏమున్నది ఆ పల్లేనిండా
ఎండిన వాగువంకలతో ఎడారిలా మారి
చేతికందిన పంట ఎండిపోతుంటే
పసిపిల్లాడికి పాలివ్వలేని తల్లిలా
పల్లే కంటతడిపెడుతూ కనిపించే...
కరెంటు కోతలతో,ఆకాశన్నంటిన నిత్యవసర ధరలతో
అడుగడుగునా అప్పుల భాధలతో...ఆకలి చావుల ఆర్థనాధాలతో
నిశ్శబ్ధం నిండిన స్మశానంలా
పండగ పూట పల్లె సిన్నబోయి కనిపించేసరికి
ఆవిరైపోయింది నాలో కవితావేశం
అభివృద్దిపేరుతో ప్రాజెక్టులంటూ,పరిశ్రమలంటూ
పంటపొలాలని,ప్రకృతి అందాలని,
పల్లె సంస్కృతిని,ఆచారాలని అంతం చేస్తుంటే..
అది చూసి ఏమని రాయను కవిత
ఎలా వర్ణించను ఆ పల్లే గోస

....బాబు
(08-04-2013)