ఎంత అధ్బుతమైనది ఈ కల...
దేవుడిచ్చిన అందమైన వరమేనేమోకదా?
అసాద్యమనుకున్న నిన్ను నన్ను
కొన్ని క్షణాలైనా ఒక్కటి చేసిన గొప్ప మాయే కదా!
ఎంతగా నిను ప్రేమించినా
ఏనాడు పట్టించుకోకపోగా
ఎప్పుడు కసురుకునే నీవు...కలలో మాత్రం..
గుండెల నిండిన ప్రేమని కళ్ళతోనే పలికిస్తూ
ఆత్మీయంగా నను నీ గుండెలకి హత్తుకుంటావు..
అందమైన నిన్ను మరింత అందంగా పొగుడుతుంటే
ఆనందంతో చిన్న పిల్లల మురిసిపోతూ
ముద్దుల్లోముంచేస్తుంటావు..
చిరునవ్వుల వెన్నెల కురిపిస్తూ
మల్లెల మాటలతోటలో ఆప్యాయంగా విహరింపజేస్తావు...
అంతలోనే ఎదో అలక చుట్టుముట్టగా...
కంటిపాపలకి నువు గొరింటాకు అద్దగా
తల్లడిల్లిపోయిన నా మనసు తట్టుకోలేక
ప్రేమగా నిను బ్రతిమిలాడుతుంటే
కన్నీటితో నా గుండేని తడిచేస్తావు..
నీ ప్రేమతో నా కళ్ళుచెమ్మగిల్లేలా చేస్తావు..
ఎంత అధ్బుతమైనది ఈ కల...
దేవుడిచ్చిన అందమైన వరమే కదా....
......బాబు
కలలోని ప్రేయసి ఇలలోకి త్వరగా రావాలి!!! మీరు చెప్పిన విధానం చాలా చాలా బాగుంది. చాలా రోజుల తరువాత నా మనసుకు నచ్చిన కవిత చదివిన...
ReplyDeletethank you subhashini gaaru
ReplyDeleteLovely lines................<3
ReplyDelete