Friday, July 29, 2011

ఎలా నిన్ను నే మరిచేది...

నీ  అల్లరి మాటలు...
అమాయకమైన నీ చూపులు...
నిత్యం నీ పెదాలపై చిందులేసే ఆ చిరునవ్వులు
నా గుండే చప్పుడై
ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంటే....
ఎలా మిత్రమా నిన్ను నే మరిచేది...
బ్రతికున్నా.. శవంలా బ్రతికేది...

నీతో అప్యాయంగా గడిపిన ఆ మధురక్షణాలు
నీతో అల్లరిగాపడ్డ ఆ గొడవలు..
ప్రతిసారీ నీ అలకలు...ఆ నీ ముతి ముడుపులు...
అనుక్షణం నా నీడల్లే వెంటాడుతుంటే
నిముషమైనా నిలువ లేక పోతున్నా ....
నిను తలువ కుండా...
కలలోను కలవరపెడుతుంటే...
కన్నీరై కారుతూ  గుండెల్నితాకుతుంటే...
లోలోపలే సమాధి చేసుకున్న
నీ జ్ఞాపకాలను తడుముతూ
మరువాలని  ప్రయత్నిస్తున్న నాకు...
మళ్ళి మళ్ళి గుర్తుచేస్తుంటే..
ఎలా మిత్రమా నిన్ను నే మరిచేది,
గుండెలోని నీ గురుతుల్ని శాశ్వతంగా చెరిపేసేది....
బ్రతికున్నా.. శవంలా బ్రతికేది...

                              .....బాబు

Friday, July 22, 2011

కదులుదాం....

ఏ రాజకీయనయకుడు
ఉద్యమిస్తాడన్నా....
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం..
వాడి కొడుకేమన్న
తెలంగాణ వస్తేనే సానా బతుకుల్లో
వెలుగులు నిండుతాయని...
రేపు ఉదయించడానికని..
అగ్గికి ఆహుతవుతూ...
నేడు అస్తమించాడా....

వాడి కూతురేమన్నా
తెలంగాణా ఆడపడుచుల
జీవితాలు పచ్చగుండాలని...
పసుపు కుంకుమలు పయిలంగావుండాలని
తన పసుపు తాడుని త్యాగంజేసి
తల్లడిల్లిపోతుందా....
కంటికి రెప్పలా చూసుకుంటాడనుకున్న
కన్నకొడుకొడుకు
కళ్ళ ముందే కాలిపోతే
కలిగిన తల్లి కడుపుకోతేమైన అనిభవించినోల్లా...

కదులుదాం మనమే పిడికిలేత్తి...
కదులుదాం మనమే కత్తులవోలే..
మన త్యాగాలను...
మన సెంటిమేంట్స్ లను
సొమ్ముచేసుకుంటున్నోల్ల తలలు నరక...
మళ్ళి వాళ్ళ జీవితంలో రాజకీయ ఉనికి లేకుండా చేయ....
కదులుదాం మనమే కత్తులవోలే...
                                                                                        .......బాబు

Monday, July 11, 2011

ప్రయాణం

ఎందుకో ఏమోగాని నేడు నే చేసిన ప్రయాణం
చూపించేను ఇంతకుముందేన్నడు ఎరుగని సరి కొత్తదనం...
ఇది నేనెన్నటికి మరువని ఓ మధురానుభూతుల సంగమం
దూరమనిపించనేలేదూ......
కాలమసలే తెలియలేదూ.....
మధ్య మధ్యలో చిరు చిరు చినుకుల పలకరింపులు
మనసును మత్తుగా హత్తుకున్న మట్టిపరిమళాలు
నన్ను చల్లగా దీవించటానికే వస్తున్నాయా అన్నట్లు
నాతోనే కదిలివచ్చిన ఆ కారు మబ్బులు...
తొలకరికి పులకరించి
మరో కాన్పుకు సిద్దం అన్నట్లు
సిగ్గుపడుతు కనిపించిన  ఆ పంట పొలాలు
తడిసి తడిసి ముద్దయి
తనువంత పచ్చదనాన్ని చీరలా కప్పుకున్న ఆ కొండకోనలు
ఎండైనా,వానైనా మాకేమిటి అన్నట్లు
చెమట చుక్కనే నమ్ముకున్న రైతన్నలు...
వారి మోముపై చెదరని చిరునవ్వులు...
ఎన్నో...ఎన్నేన్నో ఇలాంటి సౌందర్య దృష్యాలు
కంటికి కనివిందు చేస్తూ
మనసుకు ఆహ్లాదాన్నందిస్తూ..
సాగిన నా ప్రయాణం...
చూపించేను నాలో నాకే తెలియని సరికొత్త కోణం....

                                                      ......బాబు

Sunday, July 10, 2011

మౌనం

నీతో మాట్లాడకుండావున్న ఒక్కరోజే
కొన్ని యుగాలుగా తోస్తుంటే
కరిగిపోని ఈ కాలాన్ని తిట్టుకోనా....
మాట్లాడలేకుండా మౌనంగా ఉన్న నా మనసును నిందించుకోనా ...
ఏది ఏమైనా
మౌనంగానే తెలుపుతున్న నా మనోవేదన...
మౌనంగానే చేస్తున్నా నీకై నే ఆరాధన...
ఈ మౌనమైన అవుతుందేమో మన మనసులను కలిపే వంతెన...
                                                                 ....బాబు

Thursday, July 7, 2011

తెలుగుభాష

బ్రతుకు పోరులో...
భావవ్యక్తికరణకై ....
భాషలెన్నో నేర్చుకున్నాను గాని 
నా తెలుగు భాషాలో ఉన్న తియ్యదనమైనా...
అనురాగమైనా...
ఆప్యాయతలైనా...
అణువంతైనా కానరాలేదు నాకు....
పదాలాలో అనురాగాన్ని సింగారించుకొని..
ఆప్యాయతని పంచటంలో అమ్మలాగా అనిపించేది నా తెలుగు భాషా ఒక్కటే...

                                                                             .......బాబు