Monday, July 11, 2011

ప్రయాణం

ఎందుకో ఏమోగాని నేడు నే చేసిన ప్రయాణం
చూపించేను ఇంతకుముందేన్నడు ఎరుగని సరి కొత్తదనం...
ఇది నేనెన్నటికి మరువని ఓ మధురానుభూతుల సంగమం
దూరమనిపించనేలేదూ......
కాలమసలే తెలియలేదూ.....
మధ్య మధ్యలో చిరు చిరు చినుకుల పలకరింపులు
మనసును మత్తుగా హత్తుకున్న మట్టిపరిమళాలు
నన్ను చల్లగా దీవించటానికే వస్తున్నాయా అన్నట్లు
నాతోనే కదిలివచ్చిన ఆ కారు మబ్బులు...
తొలకరికి పులకరించి
మరో కాన్పుకు సిద్దం అన్నట్లు
సిగ్గుపడుతు కనిపించిన  ఆ పంట పొలాలు
తడిసి తడిసి ముద్దయి
తనువంత పచ్చదనాన్ని చీరలా కప్పుకున్న ఆ కొండకోనలు
ఎండైనా,వానైనా మాకేమిటి అన్నట్లు
చెమట చుక్కనే నమ్ముకున్న రైతన్నలు...
వారి మోముపై చెదరని చిరునవ్వులు...
ఎన్నో...ఎన్నేన్నో ఇలాంటి సౌందర్య దృష్యాలు
కంటికి కనివిందు చేస్తూ
మనసుకు ఆహ్లాదాన్నందిస్తూ..
సాగిన నా ప్రయాణం...
చూపించేను నాలో నాకే తెలియని సరికొత్త కోణం....

                                                      ......బాబు

4 comments: