Wednesday, June 22, 2011

ఎలా చెప్పను...

నా మదిలోని భావాలకి  అందమైన అక్షరరూపమిచ్చి
నీకందించాలని  నా మనసు ఆరాటపడుతుంటే.....
నేనంటే నేను అల్లుకు పోతానంటు
నా భావాలని నీకు అందించే అదృష్టం నాకివ్వమంటు
పదాలు పోటీపడుతుంటే.....
అక్షరాలన్ని అందంగా సింగారించుకొని
నేనంటే నేను ముందని ప్రాదేయపడుతుంటే.....
ఎలా చెప్పను....
ఏ భాషలో చెప్పను....
ఎదలోనే ఎదుగుతున్న నీపై ప్రేమను....
                                  ....బాబు

Tuesday, June 21, 2011

ఎవరు నువ్వు...?

వరు నువ్వు...?
నిన్ను చూసిన ఆ తొలి క్షణం
కళ్ళముందు కదలాడుతునేవుంది ప్రతిక్షణం...
ఎమైందో ఎమోగాని నాలో ఆ నిముషం...
కలిగెను అంతకుముందేన్నడు ఎరుగని ఎదో సంతోషం....
ఎవరు నువ్వు...?
ఆకాశం నుండి సరాసరి నేలకి
దిగివచ్చిన నింగి చుక్కవా...
అందాలన్ని సింగారించుకొని
ప్రకృతిఒడిలో ప్రాణం పోసుకున్న అడవిమల్లేవా....
పండుపున్నమినాడు విరబూసిన
నిండు చందమామవా....
ఎవరు నువ్వు...?
ఎందుకు  ఎదురయ్యావు నా జీవితప్రయాణంలో....?
కుదరదు అని తెలిసినా నా మనసు నిలవనంటుంది,
నువ్వు ప్రేమగా మాట్లాడితే వినాలని మారం చేస్తుంది.
మౌనంగానైనా సరే నీ కళ్ళలోకి చూస్తూ కాలం గడిపేయాలని ఆరాటపడుతుంది.


                                                                                 .......బాబు

Saturday, June 11, 2011

ఉరుకుల పరుగుల జీవిత ప్రయాణం

బ్రతుకుదేరువులో
నే నడిచిన దారిలో
ఒక్కసారి వెనక్కితిరిగి చూస్తే
అడుగడుగునా అనుభవవించిన బాధలెన్నో....
ఆత్మ సంతృప్తి అడ్రస్సు మరిచి
ఆత్మాభిమానం,అనురాగాల జాడవిడిచి
అనునిత్యం అడుగులేస్తునే ఉన్నా
ఆగని ఈ ఉరుకుల పరుగుల జీవిత ప్రయాణంలో....
కన్నవాల్లు కన్న ఆశయాల సాధనలో
కనుమరుగైపోయిన ఆనందాలెన్నో....
కాసులవేటలో ..కాలంతోపాటు
ప్రతి క్షణం పక్కవాడితో పోల్చుకుంటు
పరుగులు తీసిన క్షణాలు ఎన్నో...
నాకై నేను బ్రతకటం మరచి
మానవత్వం విలువలు విడిచి
ఇష్టమున్నా లేకున్నా వదులుకున్నా
ఇంతకాలం ఎంతో ఇష్టంగా నాలో పెంచుకున్నా
ఇష్టా ఇష్టాలేన్నో....
                            .....బాబు

Wednesday, June 1, 2011

మరువలేను మిత్రమా....

నమ్మిన ప్రేమ నాకు మిగిల్చిన చేదుజ్ఞాపకాలు
ప్రతి క్షణం గుర్తుకోస్తూ..
అనుక్షణం నా ప్రాణాలని నిలువునా చిల్చేస్తూంటే
చితిమంటల జాడని అన్వేషిస్తు
జీవితాన్ని ద్వేషించుకుంటూ..
నమ్మిమోసపోయిన మనసును  అసహ్యించుకుంటు
మరణం వైపు మౌనంగా నే అడుగులేస్తుంటే

అనుకోకుండా అప్యాయంగా ఒక మనసు నన్ను పలకరించింది
మాటలతో చినుకల్లే నా మదిని తాకి
ఆవిరైపోతున్న నా ఆశలకి ఊపిరోసింది
మరణమే శరణ్యమనుకొంటు,
రాయిలా మారినా నా మనసుకి
కల్మషం ఎరుగని ఆ పరిచయం
ప్రాణంపోసి మరుజన్మనిచ్చింది
మనిషిగా మళ్లీ నన్ను నిలబెట్టింది

కన్నీటీలో కరిగిపోతున్న నా ఆశయాలని
గతి తప్పిన నా గమ్యాన్ని
అనుక్షణం నాకు గుర్తుచేసి
కొండంత ధైర్యం ఇస్తూ అండగా ఉండి
నన్ను ముందుకు నడిపిన నిన్నూ,నీ స్నేహాన్ని
మరువలేను మిత్రమా....
నే మరణించేదాకా....
      
        .......బాబు