Saturday, June 11, 2011

ఉరుకుల పరుగుల జీవిత ప్రయాణం

బ్రతుకుదేరువులో
నే నడిచిన దారిలో
ఒక్కసారి వెనక్కితిరిగి చూస్తే
అడుగడుగునా అనుభవవించిన బాధలెన్నో....
ఆత్మ సంతృప్తి అడ్రస్సు మరిచి
ఆత్మాభిమానం,అనురాగాల జాడవిడిచి
అనునిత్యం అడుగులేస్తునే ఉన్నా
ఆగని ఈ ఉరుకుల పరుగుల జీవిత ప్రయాణంలో....
కన్నవాల్లు కన్న ఆశయాల సాధనలో
కనుమరుగైపోయిన ఆనందాలెన్నో....
కాసులవేటలో ..కాలంతోపాటు
ప్రతి క్షణం పక్కవాడితో పోల్చుకుంటు
పరుగులు తీసిన క్షణాలు ఎన్నో...
నాకై నేను బ్రతకటం మరచి
మానవత్వం విలువలు విడిచి
ఇష్టమున్నా లేకున్నా వదులుకున్నా
ఇంతకాలం ఎంతో ఇష్టంగా నాలో పెంచుకున్నా
ఇష్టా ఇష్టాలేన్నో....
                            .....బాబు

4 comments:

  1. నిజమే... ఈ పాడు ప్రపంచం తో నేను పరిగెడుతున్నాను...మనస్సాక్షి తో పని లేకుండా..తాత్కాలిక ఆనందాన్నిచ్చే కాసుల వేటకై బయల్దేరాను....
    చాల బాగా రాసారండి...

    ReplyDelete
  2. ధన్యవాదాలు ఉమాదుర్గ గారు...

    ReplyDelete
  3. prathi manishi elage alochistaru.kani bhavalu rayagalegede konthamande.

    ReplyDelete