Saturday, August 24, 2013

ఆరాటం

ఊహల వాకిల్లలో
విహరించు వేళ
కలల తీరంలో
అలలై ఎగసిన
అస్పష్ట దృష్యాలని
కాన్వాసు పై బందించి
ఊహలని వాస్తవాలని
రంగరించి రంగులద్ది
ప్రాణం పోసి
మౌనంగా మాట్లాడటం నేర్పి
ప్రపంచానికి పరిచయంచేయాలని
పదే పదే పరితపిస్తుంటా..
అనుక్షణం ఆరాటపడుతుంటా...

ఊహల ఊబిలో
ఊపిరిబోసుకున్న ఊసులకి
మనసు గదిలో
ఆలోచనల సంఘర్షనలో
ఆవిర్బవించిన భావాలకి
ఆక్షరాలతో జీవంపోసి..
ఒక్కసారిగా రెక్కలోచ్చిన
పక్షిలాగా ఆ అక్షరాలని
అన్ని దిక్కులా 
ఆశగా ఎగరనివ్వాలని
అనుక్షణం ఆరాటపడుతుంటా...
పదే పదే పరితపిస్తుంటా..
         .....బాబు(12-08-13)

2 comments:

  1. పక్షిలాగా ఆ అక్షరాలని
    అన్ని దిక్కులా
    ఆశగా ఎగరనివ్వాలని
    అనుక్షణం ఆరాటపడుతుంటా...
    కొత్తగా బాగుందండి.

    ReplyDelete