అక్షరమా నీ ఋణమెట్లా తీర్చుకోను
మనసుపడిన మగువకు
మదిలోని మాటలు తెలుపదలచినపుడు
పదాలు పెదాలు దాటనివేళ
లోలన నే మదనపడుతుంటే
కాగితంపై అందంగా ఒదిగి
నేనున్నా అన్నావు..
కోపమైనా,ఆవేశమైనా
ఆరాటమైనా,ఆలోచనైన
అందంగా అల్లుకున్నావు
అందరికి చేరువయ్యావు
ఎవరిని నొప్పించకుండా
నా మనసు అద్దమై నిలిచిన నీ...
పాదాలకి వందనాలు...
....(బాబు 27-08-2013)
అక్షరమా నీ ఋణమెట్లా తీర్చుకోను?
ReplyDeleteనిశ్శబ్దం గా !
జిలేబి
చాలా బాగుంది !!
ReplyDeletethank you..
Deletesuper...
ReplyDelete