Monday, April 15, 2013

ఆధునిక యుగంలో అచ్చతెలుగమ్మాయి


ఎవరే చెలి నీవు
ఏ లోకంనుండి ఎగిరొచ్చావు...
ఆధునికతంటూ ఆగమైపోతున్న
నేటి ఈ లోకంలోకి...
ఆశ్చర్యాంగా ఉంది...
మరోవైపు అధ్బుతంగాను ఉంది..
ఆడేవరో మగెవరో అంతుపట్టరాని
అలంకరణల ఈ యుగంలో...
అచ్చతెలుగు అమ్మాయంటే...
కవుల భావాల్లోనో...
కళాకారుల ఆకృతుల్లోనో
జీవంలేని కలల్లోనో
ఊపిరిలేని ఊహల్లోనో...మాత్రమే
కనిపించే ఈ రోజుల్లో...
ఒక మెరుపులా మెరిసావు పరికిణిలో
పచ్చని పైరులా
మా పెరటిలోన  సీతకోక చిలుకలా
చిన్ననాటి మా గుడిసే గూడులోని గువ్వ పిట్టలా
వయ్యారంగా వంపులు తిరిగిన మా ఊరి వాగులా...
తొలకరి జల్లుకి పులకరించిన పుడమితల్లి మట్టివాసనలా...
తొలి పొద్దు కిరణాల స్పర్శకి
విచ్చుకున్న పొద్దుతిరుగుడుపువ్వులా
ముద్దు ముద్దుగా..
పాతకాలపు పల్లె అందాలన్ని
నిలువెల్ల సింగారించుకొని...
అడవిమల్లేలాంటి అందంతో
పారిజాత పరిమళాలు వెదజల్లుతూ..
హంసలాగా వయ్యారంగా నడుస్తూవుంటే
పట్టపగలు పండు వెన్నెల విరబూసే
నిండుగా నా రెండు కనుల కొలనులో
పదే పదే అదేపనిగా నిను చూడాలనిపించేలా...
అందం..అమయకత్వం...నిండిన ఆ కళ్ళతో
మంత్రమేదొవేసి..నను దాటి వెళ్తుంటే..
నను నేను గిల్లి చూసుకున్న
నమ్మశక్యంకాని
ఈ నిజం ఋజువు చేసుకోవటానికన్నట్లు...

                               .....బాబు(15-04-2013)


9 comments:

  1. Good expression :) When n where did u find HER?

    ReplyDelete
  2. ప్రేమ, దోమ, గురించి చదివి చదివి విసుగొచ్చింది, ఒక మంచి కవిత...

    ReplyDelete
  3. హల్లొ.. బాబు గారు చాల బాగా రాసారు తెలుగు అమ్మయి గురించి.. నైస్ పొస్ట్..

    ReplyDelete
  4. బావుంది... అప్పుడే పూసిన పువ్వులా స్వచ్చంగా ఉందండి...

    ReplyDelete