Thursday, December 29, 2011

నిత్యం నువ్వు నా వేంటేవున్నావు... నమ్మటం లేదా..?

నిత్యం నువ్వు నా వేంటేవున్నావు
నమ్మటం లేదా..?
కావాలంటే..ఒకసారి
కనులు మూసుకోని
మౌనంగా మనసుతో
చూడూ నావైపు...
ప్రేమగా మాట్లాడుతూ...
నా చేయి పట్టి నడుస్తూ..
పసిపాపలా నవ్వుతూ...
గిలిగింతలు పెడుతూ...
గొడవపడతూ....
అమాయకంగా అల్లరిచేస్తూ...
నను చిలిపిగా కొడుతూ..
ఆనందపడుతూ
అలకబూనుతూ
అమాయకంగా
ఆడుతూ ఆడూతూ
అలసి నా గుండేపై వాలి
సేదతిరుతున్నావు...

కనిపించావా?

ఇంకా కనిపించలేదా.....!
అయితే
నీ రూపాన్నే నింపుపుకున్న
కనుపాపని కళ్ళారా చూడు
నీ పేరే గుండే చప్పుడుచేసుకున్న
తీరుని మనసార విను
నేను రాసే ఆక్షరాల అడుగున దాగిన భావాలని
గుండేలకి హత్తుకొని చదువు....
మాటలకి అందని మరెన్నో భావాలని నా చిత్రాలలో మలిచా..మరిచిపోకుండా చూడు
నీ మనసుకి నువ్వు ఖచ్చితంగా కనిపిస్తావు...
నీపై పెంచుకున్న ప్రేమ తప్పకుండా కనిపిస్తూంది...

.....బాబు

7 comments:

  1. మీ భావుకత బాగుంది!

    ReplyDelete
  2. కవిత ఎక్కడనో టచ్ అవుతంది బాబు

    ReplyDelete
  3. మీ భావాలు, వ్యక్తీకరణశైలి బాగున్నాయి. వాక్యాలలో పదాలను తగ్గించి ఇంకా క్లుప్తంగా రాయడానికి ప్రయత్నం చెయ్యండి. కవిత్వం ఇంకా చిక్కబడుతుంది. ఇంక బ్లాగ్ టెంప్లేట్...చాలా అద్భుతంగా, ఉంది. బేక్ గ్రవుండ్ కలర్ నలుపుకాకుండా వేరేది ఉంటే బాగుండునేమో. అభినందనలు.

    ReplyDelete
  4. thank you sudha garu...tappakunda miru cheppina vishayalanu marchukuntanu

    ReplyDelete