Sunday, April 21, 2013
Monday, April 15, 2013
ఆధునిక యుగంలో అచ్చతెలుగమ్మాయి
ఎవరే చెలి నీవు
ఏ లోకంనుండి ఎగిరొచ్చావు...
ఆధునికతంటూ ఆగమైపోతున్న
నేటి ఈ లోకంలోకి...
ఆశ్చర్యాంగా ఉంది...
మరోవైపు అధ్బుతంగాను ఉంది..
ఆడేవరో మగెవరో అంతుపట్టరాని
అలంకరణల ఈ యుగంలో...
అచ్చతెలుగు అమ్మాయంటే...
కవుల భావాల్లోనో...
కళాకారుల ఆకృతుల్లోనో
జీవంలేని కలల్లోనో
ఊపిరిలేని ఊహల్లోనో...మాత్రమే
కనిపించే ఈ రోజుల్లో...
ఒక మెరుపులా మెరిసావు పరికిణిలో
పచ్చని పైరులా
మా పెరటిలోన సీతకోక చిలుకలా
చిన్ననాటి మా గుడిసే గూడులోని గువ్వ పిట్టలా
వయ్యారంగా వంపులు తిరిగిన మా ఊరి వాగులా...
తొలకరి జల్లుకి పులకరించిన పుడమితల్లి మట్టివాసనలా...
తొలి పొద్దు కిరణాల స్పర్శకి
విచ్చుకున్న పొద్దుతిరుగుడుపువ్వులా
ముద్దు ముద్దుగా..
పాతకాలపు పల్లె అందాలన్ని
నిలువెల్ల సింగారించుకొని...
అడవిమల్లేలాంటి అందంతో
పారిజాత పరిమళాలు వెదజల్లుతూ..
హంసలాగా వయ్యారంగా నడుస్తూవుంటే
పట్టపగలు పండు వెన్నెల విరబూసే
నిండుగా నా రెండు కనుల కొలనులో
పదే పదే అదేపనిగా నిను చూడాలనిపించేలా...
అందం..అమయకత్వం...నిండిన ఆ కళ్ళతో
మంత్రమేదొవేసి..నను దాటి వెళ్తుంటే..
నను నేను గిల్లి చూసుకున్న
నమ్మశక్యంకాని
ఈ నిజం ఋజువు చేసుకోవటానికన్నట్లు...
.....బాబు(15-04-2013)
Wednesday, April 10, 2013
ఏది ఉగాది?
ఉగాది వస్తుందికదా అని
ఉల్లాసంగా ఏదో నాలుగు అక్షరాలు
అందంగారాయాలని ఆనందంగా నాలో నేనే
ఓ కవిలా ఫీలవుతుంటే...
అక్షరాలు నన్ను చూసి నవ్వాయి
నువ్వు కవివేంటిరా అన్నట్లూ...
అయినా పరవాలేదని
పదాల అర్థాలు తెలియకపోయినా
ప్రాసలో మాత్రం మంచి పస ఉండాలని
పది దినాల నుండి పనిమానుకొనిమరీ
నా అలోచనల్ని పరి పరి విదాల పలు దిక్కులు పరిగెత్తిస్తుంటే
ప్రకృతి గుర్తొచ్చి ఫటా ఫట్ ఓ పది వాక్యాలు రాసి
కవిననిపించుకోవాలని కలం పట్టి కవిత పని పట్టాలని
కాగితం ముందు కుర్చున్నా కాని
మళ్ళి ఏదో తడబాటు
ప్రకృతి అందాలని ప్రత్యక్షంగా చూస్తే తప్ప
కలం కదిలేలా లేదనని నేనే కదిలా
ఎప్పుడో నా చిన్నపుడు పెరిగిన మా పల్లేటూరికి
పాత జ్ఞాపకాలని నేమరేసుకుంటూ
పల్లేవాకిల్లల్లో నడుస్తూ
నా చిన్నతనంలోలాగా
వరసలు కలిపి ఆప్యాయంగా పలకరించే
మనుషులు ఎదురోస్తారని
పచ్చని పైరు పంటలు
గల గలా పారేటి సేలయేళ్లు
పూతవేసిన మామిడితోటలు
లేత చిగురు తింటు పరవశంతో పాడేటి కోయిలలు
ఝుమ్మని పలికే తుమ్మెదలు దర్శనమిస్తాయేమోనని
ఎంతో ఆశతో వెళ్తే.... ఎక్కడకూడా
చైత్ర మాసపు చాయల్లేవు
వసంతకాలపు ఆనవాల్లు కాసింతైనా కానరాలే
ఎటు చూసిన ఏమున్నది ఆ పల్లేనిండా
ఎండిన వాగువంకలతో ఎడారిలా మారి
చేతికందిన పంట ఎండిపోతుంటే
పసిపిల్లాడికి పాలివ్వలేని తల్లిలా
పల్లే కంటతడిపెడుతూ కనిపించే...
కరెంటు కోతలతో,ఆకాశన్నంటిన నిత్యవసర ధరలతో
అడుగడుగునా అప్పుల భాధలతో...ఆకలి చావుల ఆర్థనాధాలతో
నిశ్శబ్ధం నిండిన స్మశానంలా
పండగ పూట పల్లె సిన్నబోయి కనిపించేసరికి
ఆవిరైపోయింది నాలో కవితావేశం
అభివృద్దిపేరుతో ప్రాజెక్టులంటూ,పరిశ్రమలంటూ
పంటపొలాలని,ప్రకృతి అందాలని,
పల్లె సంస్కృతిని,ఆచారాలని అంతం చేస్తుంటే..
అది చూసి ఏమని రాయను కవిత
ఎలా వర్ణించను ఆ పల్లే గోస
....బాబు
(08-04-2013)
Subscribe to:
Posts (Atom)