Wednesday, April 27, 2011

ఈ కాలం కరిగిపోదేమి ?

నువ్వు వస్తున్నవన్న మాట తెలిసి
మనస్సులో సరికొత్త ఆశల అలజడి
ఇన్నాల్లు నా కళ్ళలోనే దాగిన
నీ రూపాన్ని కళ్లారా చూడాలని....
నీకై కన్న కలలని.....
గుండెల్లోనే దాచుకున్న మాటాలని.....
ప్రత్యక్షంగా నీతో పంచుకోవాలని
ప్రతి క్షణం పరితపిస్తుంటే.....
ఈ కాలం కరిగిపోదేమి ?
నాపై కాస్తయిన కరుణ చూపదేమి ?

ఇన్ని రోజులు లేనిది ఎమిటి ఈ పరిస్తితి.....
ఇంతకి ముందేన్నడు ఎరుగని వింత అనుభూతి...
పదహారు మాసాలు...
నిను చూడకుండా గడిపిన నాకు
పది రోజులు యుగాలుగా తోస్తుంటే........
ఇంకా ఇన్ని క్షణాలా,
ఇన్ని నిముషాలా,
ఇన్ని గంటలా,ఇన్ని రోజులా
అని ఇలా క్షణ క్షణం లెక్కిస్తునేవున్నా...
ప్రతి క్షణాన్ని ప్రార్థిస్తునేవున్నా....
పరుగులు తీయించు ఈ కాలాన్ని అని
కలలు కంటున్న క్షణాన్ని నా కళ్ల ముందుచమని...
అయినా ...
ఈ కాలం కరిగిపోదేమి ?
నాపై కాస్తయిన కరుణ చూపదేమి ?

Monday, April 25, 2011

నేను...

యదలో ఎగసి పడుతున్న ఎన్నో భావాలను
అందమైన అక్షరమాలగా అల్లి నీకందించా.......
నే కవినైనా కాకపోతినే.........
పెదాలు దాటని పదాలకు
సుస్వారాలు జతపరిచి
మధుర రాగాలుగా మలచ..
నే గాయకుడినైన కాకపోతినే.....
.....బాబు.

నేనూ.. ప్రేమని పొందానూ.....

నేనూ.. ప్రేమని పొందానూ.....
నవమాసాలు తన కడుపులో
కంటికి రెప్పలా కాపాడుకొని...
తనలో తానే ప్రేమను పెనవేసుకొని...
కానరాని రూపాన్ని చేతివేల్లతోనే ముద్దాడుకొని...
పురిటిలోనే శిశువుని కోల్పోయి...
చివరికి అమ్మా అని కుడా పిలిపించుకొలేక పోయిన
ఓ దౌర్భగ్యపు కన్నతల్లి కడుపు బాధలా.....
నేనూ.. ప్రేమని పొందానూ.....
.........బాబు

Sunday, April 24, 2011

జ్ఞాపకాల అలజడి

ఎలా పరిచయం అయ్యావో తెలియదు
ఎందుకు పరిచయం అయ్యావో తెలియదు
యదలో మాత్రం
ఎన్నటికి మాయని గాయమయ్యావు......
కన్నీరంటే ఎరుగని నాకళ్ళల్లో
నిత్య దారవయ్యావు......

మరువలేని మధుర జ్ఞాపకమై
మదిలోనే గూడుకట్టుకోని
రగులుతున్న అగ్నిపర్వతమల్లే
నిత్యం నీ జ్ఞాపకాల జ్వాలని వెదజల్లుతునేవున్నావు.
చితిమంటలకి సైతం చెదరని గురుతులని,
గతకాలపు జాడల పునాదులను...
ఎప్పటికప్పుడు గునపాలై పెకిలిస్తునేవున్నావు...

ఎంత వద్దనుకుంటున్నా,
కాదని కాలానికి ఎదురెల్లుతున్నా....
నీతో ఆప్యాయంగా గడిపిన ఆ మధుర క్షణాలు
అణుక్షణం దూసుకోచ్చే బాణాలై
భూతకాలం వైపు నన్ను పరుగులెత్తిస్తునేవున్నాయి.

Friday, April 15, 2011

I MISS U...

తడి ఆరిన నా గుండెల్లో
సరికొత్త ఆశలు చిగురింపజేయవచ్చిన
చిరుజల్లువనుకున్నాను.....
చీకటితో అలుముకున్న
నా మనసులో వెలుగులు నింపవచ్చిన
వెండి వెన్నెలవనుకున్నాను.....

నా తనువు అణువణువు తానైనప్పుడు

తన ఎత్తిపోడుపు మాటలతో
నా మనసులో మంటలు రేపి
నను నిలువెల్ల దహించివేస్తున్నా....
నిశ్శబ్దంగా మన్నించుకుంటునే వస్తున్నా...
మా మధ్యనున్న ప్రేమ మరణించకుడదని...

అల్లరి కోసమో లేక ఆనందం కోసమో
ఆవేశం లో కలిగిన గొడవలవల్లనో...
అలకబూనిన ప్రతిసారి
తప్పునాదైనా...తనదైనా..
నా తనువు అణువణువు తానైనప్పుడు
తప్పు ఎవరిదైతేనేమనీ..
క్షమించమని కోరా...
తల్లడిల్లి పోకుడదు తన మనసని
తరిగిపోకుడదు మా మద్యనున్న ప్రేమనీ...

ఇవన్ని చేసింది...
తన పెదాలపై నిత్యం చిరునవ్వు చెదరకుడదని....
తన కళ్ళల్లో ఎనాడూ కన్నీళ్ళు చూడకూడదని...
అవేవి తేలుయక...
నా ప్రేమని కీలు బొమ్మగా
నా చేష్టలను చేతగాని తనంగా
పరిగణిస్తుంటే పగిలిపోతుంది నా గుండె..

అయినా...
పగిలిన ప్రతిసారి ఆ ముక్కలన్ని ఒక్క చోట చేర్చుతునేవున్నా....
తరగని నా ప్రేమని ఎల్ల కాలం తనకి పంచడానికై...
                                                                    ...... బాబు