Sunday, April 24, 2011

జ్ఞాపకాల అలజడి

ఎలా పరిచయం అయ్యావో తెలియదు
ఎందుకు పరిచయం అయ్యావో తెలియదు
యదలో మాత్రం
ఎన్నటికి మాయని గాయమయ్యావు......
కన్నీరంటే ఎరుగని నాకళ్ళల్లో
నిత్య దారవయ్యావు......

మరువలేని మధుర జ్ఞాపకమై
మదిలోనే గూడుకట్టుకోని
రగులుతున్న అగ్నిపర్వతమల్లే
నిత్యం నీ జ్ఞాపకాల జ్వాలని వెదజల్లుతునేవున్నావు.
చితిమంటలకి సైతం చెదరని గురుతులని,
గతకాలపు జాడల పునాదులను...
ఎప్పటికప్పుడు గునపాలై పెకిలిస్తునేవున్నావు...

ఎంత వద్దనుకుంటున్నా,
కాదని కాలానికి ఎదురెల్లుతున్నా....
నీతో ఆప్యాయంగా గడిపిన ఆ మధుర క్షణాలు
అణుక్షణం దూసుకోచ్చే బాణాలై
భూతకాలం వైపు నన్ను పరుగులెత్తిస్తునేవున్నాయి.

5 comments:

  1. Good expressions and hear touching Babu....Keep it up

    ReplyDelete
  2. నైస్ ఎక్స్ప్రెషన్
    కాని .
    చివరి లైన్ లో
    "భూతకాలం వైపు నన్ను పరుగులెత్తిస్తునేవున్నాయి"
    అందులో భూతకాలం వైపు అన్న పదం మీ దృష్టిలో ఎంత వరకు సమంజసమో నా యీ చిన్ని బుర్రకు అర్ధం కాలేదు . ?
    "భవిత వైపు నను పరుగులెత్తిస్తున్నాయి" అని ఉండాలేమో అని నేను భావిస్తున్నాను.వివరించ గలరు....శ్రేయోభిలాషి నూతక్కి రాఘవేంద్ర రావు.(www.nutakki.wordpress.com)(Kanakaambaram)

    ReplyDelete
  3. thank you sudha garu and hari...

    ReplyDelete
  4. చాలా ధన్యవాదాలు రాగవేంద్ర గారు....
    ఎంత వద్దనుకుంటున్నా,
    కాదని కాలానికి ఎదురెల్లుతున్నా....
    నీతో ఆప్యాయంగా గడిపిన ఆ మధుర క్షణాలు
    అణుక్షణం దూసుకోచ్చే బాణాలై
    భూతకాలం వైపు నన్ను పరుగులెత్తిస్తునేవున్నాయి.....
    ఇక్కడ భూతకలం వైపు అని వాడటానికి కారణం తన జ్ఞాపకాలు పదే పదే గుర్తుకువస్తు మళ్లి ఆ క్షణాలు వైపు...నన్ను ఆలోచింపజేస్తున్నాయి అని...ఎంత మరిచిపోదామని నేను అనుకుంటున్నా..మరువలేక పో్తున్నాను అనే భావంతో వాడటం జరిగినది..

    ReplyDelete