Monday, October 8, 2012

నీ పలుకులు...


వెల్లిపోతున్నావా...


వేల వేల మాటలేల..


మగువ..


నీ కళ్ళలోకి...


Monday, July 9, 2012

నీ పరిచయం..

ఎక్కడో పుట్తావు..ఎక్కడో పెరిగావు.....
ఏ జన్మలో నేజేసుకున్న పుణ్యమోగాని
ఎదురొచ్చి ఎదలో కొలువైనావు....

ఎముందో ఏమో నీలోగాని
నీ పరిచయం..
అనేకనుభూతుల సంగమం..
సకల కళల సమూహం...
నవ రసాలా సమ్మేలనం...
అడగకుండానే అందిన అద్భుత వరం....

ఏమిటి నీలో ఈ ప్రత్యేకత...?
నీ పరిచయంలో ఎన్నో కొత్త అనుభుతులు పొందా..
అందరిలా నివూ మాములు మనిషివేకదా...!
మరెందుకు  నువ్వు గుర్తొస్తేనే చాలు...
ఎదలో  పున్నమిలా విరిసే ఏనాడు ఎరుగని సంతోషాలు ....
నీకు పెట్టిన పేరు నేనేమి మెదటి సారి కాదు కదా వినటం...!
నీ పరిచయం తరువాత ప్రపంచంలో ఇంతకన్న మించిన మంచి పేరే లేదనే భావన మెదలాయే...

ఏ మాయ చేసావోగాని...
నీ అభిరుచులు..అనుభవాలు...అలవాట్లు...
అన్ని అందమైన అధ్బుతాలే నాకు...

ఏ మత్తు జల్లావోగాని....
చుట్టు ఎంత మంది ఉన్నా...నా కనుపాప నీ కోసమే  వెతుకుతున్నది...
ఎంత సేపు నీతో మాట్లాడినా...మరికాసేపని మనసు మారాం చేస్తున్నది...

ఎన్నో కలలు...మరెన్నో ఆశలు...
నీ చేయి పట్టుకొని నడవాలని...
నీ కౌగిలిలో ఒదిగిపోవాలని
నీ ఎదపై తలవాల్చి
నీ చేతి వేళ్లు తల నిమురితూవుంటే
ప్రపంచాన్ని మరచి మౌనంగా నీ మాటలు వింటు...
మరణించిన పరవాలేదనిపించే...

                                .... .....బాబు

Tuesday, April 3, 2012

ఈ రోజు....

నువ్వు తప్ప నాకేది కాడు ఎక్కువని
నువ్వుంటే చాలు ఈ లోకాన అని
ఆశలేన్నో పెంచుకొని..
నువ్వే ఊపిరిగా...
ఊహల్లో బ్రతికేస్తుంటే...
అర్థం చేసుకోకుండా
అవమానపరిస్తే
కనురెప్పలు దాటకుండా కన్నిటిని ఆపెసా...
యదలోని బాధని యదలోనే సమాధి చేసా...
మాట్లాడకుండా ఉండలేని మనసునును
మౌనంగా ఉంచేసా...
బ్రతికున్న శవంలా గడిపేసా నేడు నేనిరోజుని...

                                     ......బాబు

Wednesday, February 15, 2012

ప్రకృతి అంతా నీవే...

మరిచిపోయావో....
మరిచినట్టు నటిస్తున్నావో....
మౌనంతో మాత్రం అనుక్షణం
నను చంపుతూనేవున్నావు...
పరి పరి విదాలా ప్రయత్నిస్తున్నా
ప్రతిక్షణం గుర్తుకొస్తు....
గుండెని గునపంలా గుచ్చుతూనేవున్నావు...
నే చేసిన నేరమేమి..?
ఏ పువ్వుని చూసినా
నీ పెదాలపై విఅరబూసిన నవ్వునే తలపించే..
ప్రతి నిశబ్ధంలోను
నీ నవ్వుల సవ్వడి నా యదని తాకే
పక్షుల కిల కిలా రాగాలలో
గల గలా మాట్లాడే నీ మాటల హొరు వినబడే...
నే నడిచే దారి నేనడగకుండానే
నీ నడకలోని సుకుమారాన్ని
నీ ఆడుగుల శబ్ధాన్ని నాకు గుర్తుచేసే...
చల్లని గాలి నను చుట్టేసి
నాతో పాటే నిను నడిపించే...
అందమైన ఆ చందమామ
అందకుండావున్న నీకు ప్రతిబింబమాయే
ఇలా ప్రకృతి అంతా పరుచుకొనివున్న నీ ఙ్ఞాపకాలు
నీన్ను ఏనాటికి మరువలేకపోవటానికి గల కారణాలు
నేను ఆ ప్రకృతిలో కలిసేంతవరకి
నిను మరవటం జరగకపోవచ్చునేమో.....
                                   .....బాబు

Friday, February 3, 2012

Dream Girl

కలలోనే కనిపించి కలవరపేడుతున్నావు
కళ్ళారా చూడాలని కనులు తెరిచేలోపు
కనుమరుగైపోతున్నావు...
ఇంత అందాన్ని నేనేప్పుడూ....
చుడనే లేదే ఇంతకిముందేప్పూడూ
కాటుక దిద్దిన నీకనులు
కరిగించేనే నా మనసును
అమాయకమైన నీ చూపులు
గుండేల్లో పుట్టించేనే మెరుపులు...
అమృతం కురిపించే నీ పలుకులు
వింటే అసూయపడకమానవు ఆ చిలుకలు..
తలుచుకుంటున్నానే నిత్యం నీ పేరునే
గీసానే గుండేల్లో చెరిగిపోకుండా నీ రూపునే
కాస్తయినా కరుణించవా
కనిపించి ప్రేమని పంచవా
చిరునవ్వుతో నా దరి చేరవా
వరమని తలచి
యదలో  కొలువుంచనా...!

                      .....బాబు

Sunday, January 1, 2012

నేను....

ఎక్కువసేపు నిలువని కోపం
ఆవేశం ఎక్కువ
ఆలోచన తక్కువ
మౌనంగా ఉండలేను
మాటలు వెతుక్కుంటు
మాట్లాడనూ లేను... 

అలాగని...
మనసులోనే మాటలు దాచుకోలేను
ప్రేమించటం రాదు
నటించటం అంతకన్నా చేతకాదు
నాకు నచ్చినవారిని ఎన్నటికి వదులుకోలేను
ఎదుటి వారి మనసుని కావాలనీ ఏనాడు భాదించను..
నాకు నేను అర్థనయ్యింది ఇంతే
ఇకపై అర్థం చేసుకోవటం మీ వంతే...
.....బాబు