Wednesday, February 15, 2012

ప్రకృతి అంతా నీవే...

మరిచిపోయావో....
మరిచినట్టు నటిస్తున్నావో....
మౌనంతో మాత్రం అనుక్షణం
నను చంపుతూనేవున్నావు...
పరి పరి విదాలా ప్రయత్నిస్తున్నా
ప్రతిక్షణం గుర్తుకొస్తు....
గుండెని గునపంలా గుచ్చుతూనేవున్నావు...
నే చేసిన నేరమేమి..?
ఏ పువ్వుని చూసినా
నీ పెదాలపై విఅరబూసిన నవ్వునే తలపించే..
ప్రతి నిశబ్ధంలోను
నీ నవ్వుల సవ్వడి నా యదని తాకే
పక్షుల కిల కిలా రాగాలలో
గల గలా మాట్లాడే నీ మాటల హొరు వినబడే...
నే నడిచే దారి నేనడగకుండానే
నీ నడకలోని సుకుమారాన్ని
నీ ఆడుగుల శబ్ధాన్ని నాకు గుర్తుచేసే...
చల్లని గాలి నను చుట్టేసి
నాతో పాటే నిను నడిపించే...
అందమైన ఆ చందమామ
అందకుండావున్న నీకు ప్రతిబింబమాయే
ఇలా ప్రకృతి అంతా పరుచుకొనివున్న నీ ఙ్ఞాపకాలు
నీన్ను ఏనాటికి మరువలేకపోవటానికి గల కారణాలు
నేను ఆ ప్రకృతిలో కలిసేంతవరకి
నిను మరవటం జరగకపోవచ్చునేమో.....
                                   .....బాబు

4 comments:

  1. ఆమె జ్ఞాపకాలన్ని ప్రకృతిలో పర్చుకున్నట్టు కన్పించాయంటే మీరు ప్రెమకు బాగా దగ్గరయినట్టే.....ఆల్ ద బెస్ట్.

    ReplyDelete
  2. చాలా బాగా వ్రాశారు.. చాలా ఫీల్ ఉంది ఇందులో.

    ReplyDelete