Wednesday, July 23, 2014
ఇంటర్నేట్ యుగం
ప్రేమలు లేవు
ఆప్యాయతలు అంతకన్నా లేవు
కాసుల వేటలో
కరిగిపోతుంది కాలం
ఓ కలలా ..
మనకే కాదు ఎదుటి వాళ్ళకి ఓ మనసుందని మరిచి...
చెదిరిపోతున్నాయి మానవసంబంధాలు
కార్పోరేటు తీరు కుటుంబవ్యవస్తలో
ఇంట్లో అందరూ ఉన్నా ఎవరికి వారు ఓంటరే..
అత్యవసరాలకి తప్ప
ఆప్యాయంగా మాట్లాడుకోవటం మరిచారు
ప్రేమైనా,కోపమైనా,ఆవేశమోచ్చినా,ఏ ఆలోచనోచ్చినా అన్నీ...
whatsapp,twitter,facebook ల్లోనే...
......బాబు
Tuesday, December 17, 2013
Tuesday, August 27, 2013
అక్షరమా నీ ఋణమెట్లా తీర్చుకోను
అక్షరమా నీ ఋణమెట్లా తీర్చుకోను
మనసుపడిన మగువకు
మదిలోని మాటలు తెలుపదలచినపుడు
పదాలు పెదాలు దాటనివేళ
లోలన నే మదనపడుతుంటే
కాగితంపై అందంగా ఒదిగి
నేనున్నా అన్నావు..
కోపమైనా,ఆవేశమైనా
ఆరాటమైనా,ఆలోచనైన
అందంగా అల్లుకున్నావు
అందరికి చేరువయ్యావు
ఎవరిని నొప్పించకుండా
నా మనసు అద్దమై నిలిచిన నీ...
పాదాలకి వందనాలు...
....(బాబు 27-08-2013)
Saturday, August 24, 2013
ఆరాటం
ఊహల వాకిల్లలో
విహరించు వేళ
కలల తీరంలో
అలలై ఎగసిన
అస్పష్ట దృష్యాలని
కాన్వాసు పై బందించి
ఊహలని వాస్తవాలని
రంగరించి రంగులద్ది
ప్రాణం పోసి
మౌనంగా మాట్లాడటం నేర్పి
ప్రపంచానికి పరిచయంచేయాలని
పదే పదే పరితపిస్తుంటా..
అనుక్షణం ఆరాటపడుతుంటా...
ఊహల ఊబిలో
ఊపిరిబోసుకున్న ఊసులకి
మనసు గదిలో
ఆలోచనల సంఘర్షనలో
ఆవిర్బవించిన భావాలకి
ఆక్షరాలతో జీవంపోసి..
ఒక్కసారిగా రెక్కలోచ్చిన
పక్షిలాగా ఆ అక్షరాలని
అన్ని దిక్కులా
ఆశగా ఎగరనివ్వాలని
అనుక్షణం ఆరాటపడుతుంటా...
పదే పదే పరితపిస్తుంటా..
.....బాబు(12-08-13)
విహరించు వేళ
కలల తీరంలో
అలలై ఎగసిన
అస్పష్ట దృష్యాలని
కాన్వాసు పై బందించి
ఊహలని వాస్తవాలని
రంగరించి రంగులద్ది
ప్రాణం పోసి
మౌనంగా మాట్లాడటం నేర్పి
ప్రపంచానికి పరిచయంచేయాలని
పదే పదే పరితపిస్తుంటా..
అనుక్షణం ఆరాటపడుతుంటా...
ఊహల ఊబిలో
ఊపిరిబోసుకున్న ఊసులకి
మనసు గదిలో
ఆలోచనల సంఘర్షనలో
ఆవిర్బవించిన భావాలకి
ఆక్షరాలతో జీవంపోసి..
ఒక్కసారిగా రెక్కలోచ్చిన
పక్షిలాగా ఆ అక్షరాలని
అన్ని దిక్కులా
ఆశగా ఎగరనివ్వాలని
అనుక్షణం ఆరాటపడుతుంటా...
పదే పదే పరితపిస్తుంటా..
.....బాబు(12-08-13)
Sunday, August 18, 2013
//వరమా..?శాపమా?//
నువ్వేవరో..మరి
నేనేవరో ...
కాలం కలిపేను
కారణమేమిటో ?
అంతా ఓ కలలా..
అంతుపట్టని మాయలా ..!
అంచలంచెలుగా ఎదిగేను
అందమైన బంధమేదో...
అంతలోనే ఎదో అలజడి
అక్కున చేర్చిన కాలమే
కారణాలు వెతికి వెతికి
వేరు చేసె మనలా....
వరమనుకోవాలా
శాపమనుకోవాలా...
ఊహించని జీవితాన
ఉదయించి అస్తమించిన నీ పరిచయాన్ని..
......బాబు(18-08-13)
Saturday, August 17, 2013
Friday, August 16, 2013
Tuesday, August 13, 2013
Monday, August 12, 2013
కల
ఎంత అధ్బుతమైనది ఈ కల...
దేవుడిచ్చిన అందమైన వరమేనేమోకదా?
అసాద్యమనుకున్న నిన్ను నన్ను
కొన్ని క్షణాలైనా ఒక్కటి చేసిన గొప్ప మాయే కదా!
ఎంతగా నిను ప్రేమించినా
ఏనాడు పట్టించుకోకపోగా
ఎప్పుడు కసురుకునే నీవు...కలలో మాత్రం..
గుండెల నిండిన ప్రేమని కళ్ళతోనే పలికిస్తూ
ఆత్మీయంగా నను నీ గుండెలకి హత్తుకుంటావు..
అందమైన నిన్ను మరింత అందంగా పొగుడుతుంటే
ఆనందంతో చిన్న పిల్లల మురిసిపోతూ
ముద్దుల్లోముంచేస్తుంటావు..
చిరునవ్వుల వెన్నెల కురిపిస్తూ
మల్లెల మాటలతోటలో ఆప్యాయంగా విహరింపజేస్తావు...
అంతలోనే ఎదో అలక చుట్టుముట్టగా...
కంటిపాపలకి నువు గొరింటాకు అద్దగా
తల్లడిల్లిపోయిన నా మనసు తట్టుకోలేక
ప్రేమగా నిను బ్రతిమిలాడుతుంటే
కన్నీటితో నా గుండేని తడిచేస్తావు..
నీ ప్రేమతో నా కళ్ళుచెమ్మగిల్లేలా చేస్తావు..
ఎంత అధ్బుతమైనది ఈ కల...
దేవుడిచ్చిన అందమైన వరమే కదా....
......బాబు
Subscribe to:
Posts (Atom)