Saturday, May 28, 2011

మనసులోని మాటలు

      మనసులో మాటలు నిలువలేక,నాలో నేనే మదనపడలేక,మౌనంగా ఇక నే ఉండలేక,మదిలో యెగసిపడుతున్న భావలని లోలోపలే అనుచుకోలేక, ఎలా చెప్పాలో తెలియక,ఎవరితో చెప్పుకోవాలో  అర్థంకాక, అక్షరాల రూపంలో నీ ముందేపరుస్తున్నా. తిరిక దొరికిన సమయానా ఓపిక తెచ్చుకొని చదువుతావన్న చిన్ని ఆశతో  రాస్తున్నాను నీకు నేనీ లేఖ.....
  
      ఈన్నాళ్ళ మన పరిచయంలో ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే అంతా నువ్వే కనిపిస్తున్నావు నేస్తమా. నీ కోరికలు నీవే..... నీ ఆలోచనలు నీవే....నీ ఆశయాలు నీవే..... అవును.... వాటిని నేను ఎప్పుడు కాదనలేదు. నీతో పాటు వాటినీ ప్రేమించాను,ఇష్టపడ్డాను. కాని నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయని. నాకంటు కొన్ని ఆశయాలు,ఆలోచనలు ఉంటాయని మరిచావా నేస్తం. భాధ అయినా  ఆనందమైనా పంచుకోవటానికి నాకు ముందు గుర్తుకోచ్చేది నువ్వే. .ఎంత పని వున్నా ఎంత మందిలో ఉన్నా ఎప్పుడు గుర్తుకువచ్చేది నువ్వే.నిద్దుర లేవగానే నీ మోము చూసి నీ నూదిటిపై ప్రేమగా ముద్దుపెట్టుకొని ఈ లోకంలో నువ్వుంటే చాలు అని చెప్పలనిపిస్తది.లేచినప్పటినుండి పడుకునేదాకా ప్రతి క్షణం ఆలోచిస్తునేవుంటా ఈ క్షణం ఏం చేస్తుంటావో అని.కుదరదు అని తెలిసినా నా మనసు నిలవనంటుంది, నువ్వు ప్రేమగా మాట్లాడితే వినాలని మారం చేస్తుంటుంటుంది.మౌనంగానైనా సరే నీ ఓడిలో తలవాల్చి ఈ లోకాన్ని మైమరిచి సేదతీరాలనిపిస్తుంది. ఒంటరినన్న భావన  కలిగిన వేల చేయి పట్టి నీతో నడవలనిపిస్తోంది,.ఇవన్ని నాలో కలగటం నా తప్పంటావా....ఇలా ఆశపడటం నేరమంటావా....
    
      అవును క్షణం అయినా తీరికలేని  కష్టం నీది కావచ్చు, అణుక్షణం ఆశయాలసాదనలో అలుపెరుగని ప్రయాణం నీది కావాచ్చు....సరే నేను ఒప్పుకుంటాను,నీ ప్రయాణంలో కొండంత అండగా నేనుంటాను,కడ వరకి నీ నీడల్లే నీ తోడు నడుస్తాను. కాని నీ చిన్నిపలకరింపు కోసం ఒక మనసు ఇక్కడ ఎదురుచుస్తుంటుందని ఎలా మరిచి పోతావు నేస్తం. పిచ్చి వాడిలా వ్యవహరిస్తున్నావంటావు,కనీస  జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నానంటావు. ఆ పిచ్చి వేనకాలి ప్రేమ నీకు ఎప్పుడు కనిపించలేదా .....ప్రేమ నిండిన మనసుతో పలు సార్లు తప్పు చేసుండొచ్చు,మాట్లాడాలనే ప్రయత్నంలో నీ పనిని నేను డిస్టర్బ్ చేసుండోచ్చు  ఎన్ని మార్లు చెప్పినా అర్థం చేసుకోక నిన్ను విసిగించి ఉండోచ్చు.అంత మాత్రాన నాతో మాట్లడటం మానేస్తావా......మౌనంగా ఉంటు శిక్ష నాకు విదిస్తావా.....ప్రతి సారి నిన్ను నేను అర్థం చేసుకోవటంలో విఫలం అయివుండొచ్చు.మరి నువ్వైనా నన్ను అర్థంచేసుకొని ఉండొచ్చు కదా ...అమ్మలా మన్నించి నను నీ అక్కునచేర్చుకొని ఉండోచ్చుకదా ...చేసిన తప్పుల్ని ప్రేమగా మన్నించి ఉండొచ్చుకదా ...


             నీ ప్రేమని పొందే క్రమంలో విసిగి వేసారి.. కోపంతో ఎన్నో సార్లు నిను మరిచిపోవాలని,నీ ఆలోచనలకి దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా.. ఎదో ఒక క్షణాన నువ్వు చూపే ఆ చిన్ని ప్రేమ అన్ని మరిచి మల్లి నీ గురించి ఆలోచించేలా చేస్తుంటది.అదేనేమో మరి ప్రేమంటే..అందుకేనేమో నాకిష్టం నువ్వంటే  ...ఎది ఎమైనా ఎన్ని కష్టాలేదురైనా కడవరకి కలిసేవుండాలన్న ఆశ నాది.ఈ రోజు కాకపోతే రేపైనా.రేపు కాకపోతే ఎల్లుండైనా నన్ను,నా పిచ్చి మనసుని అర్థం చేసుకొని నాతో ప్రేమగా మాట్లాడతావన్న ఆశతో.....
                                                                                                             ఇట్లు...
                                                                                                              నీ నేను..

ఆలస్యం....

గల గలా....
అణుక్షణం అలుపన్నది లేక
ఆప్యాయంగా ప్రేమతో నువ్వు మాట్లాడుతూంటే
అర్థం చేసుకోలేక పోయానేనానాడు...
అసహ్యించుకుంటూ... అల్లరిగా భావించా...
వినిపించుకోకుండా నిను భాదించా...
కానీ....
ఇప్పుడు నువ్వు దూరమయ్యకా
నీ మనసేంటో...
నీ మాటల విలువేంటో...
నువ్వు పడిన మనోవెదనేంటో...
నీ మౌనం....నాకు అర్థమయ్యేలాజేసింది....

కళ్ల ముందు  నువ్వు నిత్యం సందడి చేస్తూ...
కల్మషంలేని ప్రేమని పంచాలాని...
ప్రతిక్షణం పరితపిస్తుంటే....
పట్టించుకోలేదు నే నేనాడూ...
ఊహలరూపంకై వెతుక్కుంటూ...
కలల్లో విహరించాను నే నానాడు...
కానీ.....
కళ్ళముందు నుండి నువ్వు దూరమయ్యేసరికి
నా కళ్ళల్లో పొంగిన కన్నీళ్ళు...
ఆనాడు నా కలల్లో కనీ కనిపించని రూపం నీదేనని...
నువ్వు ఎంత కలత చెందివుంటావోనని...
ఆలస్యంగా నాకు అర్థమయ్యేలాజేసాయి

కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది
నా తప్పుతెలుసుకొని సరిదిద్దుకొనే అవకాశమే లేకుండాపోయింది...
అణుక్షణం ఆ భావన నను చూసి నవ్వుతూ వెక్కిరిస్తునేవుంది....
బ్రతికున్నంత కాలం నను భాదిస్తూనే ఉంటుంది...
                                                   ...బాబు

Monday, May 23, 2011

ప్రేమంటే...ఇదా మిత్రమా..????

అవసరలని తీర్చుకొనుటకో...
అల్ప ఆనందాలని అనుభవించటానికో..
నాలుగురిలో గొప్పకోసమో
వాళ్లనీ వీళ్ళనీ చూసో పుట్టేది .....
కాదు మిత్రమా ప్రేమంటే...?

నలుగురు నడిచే దారి అయినా...
నాలుగు రోడ్లు కలిసే కూడలైనా...
మనకు సంబంధమే లేదన్నట్లుగా...
సభ్య సమాజమే తలదించుకునేలా...
బరితెగించి కౌగిలించుకోవటమా ప్రేమంటే.....?

మూతులు ముతులు నాక్కుంటూ
పెదాలని పెనవేసుకొని
అంగాంగము అంటిపెట్టుకొని
ఒళ్ళంతా స్ప్రూశించుకుంటు
కుక్కల కంటే హీనంగా..
ఆనందపడటమా... ప్రేమంటే....?

నేడు ఒకరితో...
రేపు మరోకరితో...
పెళ్ళిమాత్రం పెద్దలు చూసినవారితో....
జీవితాన్నంతా త్యాగంచేసినట్లుగా
నటించటమా ప్రేమంటే......?

Saturday, May 14, 2011

నీ జ్ఞాపకాలు

నీ రాకకై ఎదురుచూసిన కాలం
నువ్వు వచ్చాకా మొదటిసారి నాలో కలిగిన ఆనందం
నీ పెదాలా మాదుర్యం
నీ కౌగిలి వెచ్చదనం
అల్లరి మాటల అనురాగం
ఆప్యాయంగా గడిపిన ప్రతిక్షణం
అణుక్షణం నాకు గుర్తుకొస్తునే వున్నాయి...
ఆశలేన్నో రేపి ఊపిరాడకుండా చేసి
ఉక్కిరిబిక్కిరి చేస్తునే వున్నాయి...
నీవు నాదగ్గరగా లేక పోయినా
నీవు వదిలి వెల్లిన నీ జ్ఞాపకాలు మాత్రం
నా గుండేల్లోనే బద్రంగా దాచుకున్నాను చెలి.
                                        .......బాబు.

Tuesday, May 10, 2011

కన్నీళ్లు...

నువ్వు వెల్లిపోతుంటే...
నా కళ్ళల్లో ఉప్పొంగిన కన్నీళ్లు...
పవీత్ర గంగాజలమోలే...
నా మనసులోని మలినాలన్నింటిని కడిగేసి...
ప్రేమంటే ఏంటో నాకు తెలియజేసాయి...
నా గుండేల్లో నీ స్తానం ఎంటో నాకు అర్థమయ్యెలాజేసాయి...
మనసుకు నచ్చిన మనిషి విలువేంటో
మౌనంగా నాకు వివరించాయి....
వెల్లిపోయే దాకా తెలియనే లేదూ.....
వచ్చింది మనిషి కాదు
నా మనసు అని ....
.......... బాబు

Wednesday, May 4, 2011

ఎదురు చూపు...

యద తలుపులు తెరిచి
నీకై కన్న కళలను తివాచిగా పరిచి
నన్ను నేను పూర్తిగా మరిచి
కనిపించి కనిపించని
నీ రూపాన్ని కళ్లలోనే వెతుక్కుంటూ...
కళ్ళారా నిను చూడాలని...
ఆశల గుమ్మం లో
అనంత విశ్వం వైపు చూస్తూ
నిశ్శబ్దంగా నీరాకకై వేచిచూస్తున్నా.....

నీకై కంటున్న కళలని
నీపై పెంచుకున్న ఆశలని
పాటగా అల్లుకోని
ప్రతి క్షణం పాడుకుంటున్నా
కాలం ఇలాగైనా గడిచిపోద్దేమోనని...
కళలు కంటున్న క్షణం త్వరగా నా దరికి చేరుద్దేమోనని...
                                                                ........బాబు.