Saturday, May 28, 2011

ఆలస్యం....

గల గలా....
అణుక్షణం అలుపన్నది లేక
ఆప్యాయంగా ప్రేమతో నువ్వు మాట్లాడుతూంటే
అర్థం చేసుకోలేక పోయానేనానాడు...
అసహ్యించుకుంటూ... అల్లరిగా భావించా...
వినిపించుకోకుండా నిను భాదించా...
కానీ....
ఇప్పుడు నువ్వు దూరమయ్యకా
నీ మనసేంటో...
నీ మాటల విలువేంటో...
నువ్వు పడిన మనోవెదనేంటో...
నీ మౌనం....నాకు అర్థమయ్యేలాజేసింది....

కళ్ల ముందు  నువ్వు నిత్యం సందడి చేస్తూ...
కల్మషంలేని ప్రేమని పంచాలాని...
ప్రతిక్షణం పరితపిస్తుంటే....
పట్టించుకోలేదు నే నేనాడూ...
ఊహలరూపంకై వెతుక్కుంటూ...
కలల్లో విహరించాను నే నానాడు...
కానీ.....
కళ్ళముందు నుండి నువ్వు దూరమయ్యేసరికి
నా కళ్ళల్లో పొంగిన కన్నీళ్ళు...
ఆనాడు నా కలల్లో కనీ కనిపించని రూపం నీదేనని...
నువ్వు ఎంత కలత చెందివుంటావోనని...
ఆలస్యంగా నాకు అర్థమయ్యేలాజేసాయి

కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది
నా తప్పుతెలుసుకొని సరిదిద్దుకొనే అవకాశమే లేకుండాపోయింది...
అణుక్షణం ఆ భావన నను చూసి నవ్వుతూ వెక్కిరిస్తునేవుంది....
బ్రతికున్నంత కాలం నను భాదిస్తూనే ఉంటుంది...
                                                   ...బాబు

2 comments:

  1. మీ ఆవేదం ఆరాటం ..మీ భావ వ్యక్తీకరణ..చాల బాగుంది...కలైతే..బావున్ననిపించే నిజం లో బ్రతుకుతున్నారు కదూ....వీలయితే..దేవుడే..శక్తి నిస్తే..ఒక్కసారి..బూమిని వెనక్కి తిప్పెయాలని ఉంది కదూ...ఇదే ప్రేమంటే..మనసంటూ ఉంటె..ప్రేమంటే..ఇంతే...

    ReplyDelete
  2. అవునండి...ఒక్క సారి కాలం వెనక్కి వెళ్లితే ఎంత బాగుండునో అనిపిస్తది ఒక్కోసారి..కాని మna చేతుల్లో ఎమి ఉండదు కదా... అలా జరిగే అవకాశం ఉంటే...మనం కోల్పోయినవన్ని తిరిగిపొందొచ్చుకదా...

    ReplyDelete